Saturday, February 13, 2010

వరదలు మనిషి లో ఉన్న మలినం కడిగేస్తుందా ..?

పది మంది కుర్రాళ్ళు గడ్డ పారాలు తీసుకొని పోయ్యీ వేసారు,
ఇంకో పది మంది పక్క ఊరికి వెళ్లి బియ్యం వసూలు చేసారు,
కోట లో వంట సామాగ్రి తెచారు , పప్పు ఉప్పు నూనె ,కారం అన్ని వాటంతట అవ్వే వచాయీ ,
వంట చేస్తున్న వెంకటేశ్వర్లు ఇంకా కుర చెయ్యడమే ఆలశ్యం అన్నారు ,
ఇంతలో అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ , గొల్ల సుబ్బమ్మ కత్తి పీటలు ముందేసుకొని
కూరలు తరిమేశారు, పన్నెండు గంటల కల్ల దోసకయా పప్పు,పులుసు అన్నం తయారయ్యయీ ,
శెట్టి గారు విస్తారు కట్టలు ఇస్తే నడి బజారు లో బారులు గా వేసారు . శాస్త్రి గారు సంధ్యా వందనం ముగించుకొని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు , ఇటు పక్క చూస్తె తెలగ సుబ్బారాయుడు . ఇంకో పక్క గొల్ల రాముడు ఉన్నాడు ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు భగవాన్ నామ స్మరణలు సాగుతున్నాయి, ఇంతలో వడ్డనలు అయేపోయాయి
శాస్త్రి గారు అవుపోస పట్టే నెయ్యే కోసం చెయ్యే చాస్తే వద్దించాడనికి వచ్చిన నేతి జాడి చెంగు వెన్నక్కి వెళ్ళింది , వడ్డిస్తున్న మాల సంగడు శాస్రి గారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు అప్పుడు శాస్త్రి గారు "ఒరేయ్ సంగా! నీకు ఆకలేస్తుంది , నాకు అకాలేస్తుంది , ఇంకొకలు వేస్తె నెయ్యే నువ్వే వేస్తె నెయ్యే కాక పోదురా, వెయ్యరా అన్నాడు చెయ్యీ ముందుకు చాచి , సంగడు ఆనందంగా వడ్డించాడు .... "నమో పర్వతే పతయే : " అనుకున్నారు అందరూ...
"వరదలూ వచ్చి మనిషుల మనసులు కడిగేసింది అని అనుకుందామా ? అబ్బీ నాకు నమ్మకం లేదు ! స్నానం చేసిన వొంటికి తెల్లారే తప్పదికి మల్లి మట్టి పట్టి నట్టు మనషుల్లో మల్లి మలినం పేరుకుంటుంది , ఎన్ని వరదోలోచిన మనషుల మనసులు కడగాలేకపోతుంది .

సిరివెన్నెల సీత రామ శాస్త్రి

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ….
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ….
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం…
అప్పుడే నీ జయం నిశ్చయం రా….
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ…..
నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా… అ
నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా..
సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా….
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా…
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా…
నిశా విలాసమెంతసేపురా…. ఉషొదయాన్ని ఎవ్వడాపురా …
రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా…
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ….
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ…
దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున …
దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున …
ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..
నిరంతరం ప్రయత్నమున్నదా… నిరాశకే నిరాశ పుట్టదా …
నిరంతరం ప్రయత్నమున్నదా… నిరాశకే నిరాశ పుట్టదా …
ఆయువంటూ వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా.. …
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ ….